Friday, June 7, 2024

విమాన విధ్వంసక క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

North Korea tests anti-aircraft missile

సియోల్: కొత్తగా అభివృద్ధి చేసిన విమాన విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా శుక్రవారం ప్రకటించింది. ఈ నెలలో నాలుగో సారి జరిపిన ఆయుధ పరీక్షలో ఈ క్షిపణిని పరీక్షించినట్లు తెలిపింది. అయితే తమ శత్రువు దక్షిణ కొరియాతో ఆగిపోయిన కమ్యూనికేషన్ చానళ్లను తిరిగి తెరవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ఆ దేశం ప్రకటించడం గమనార్హం. ఈ నెలలో ఉత్తర కొరియా ఆరు నెలల తర్వాత తొలి క్షిపణి పరీక్షను తిరిగి కొనసాగించింది. అయితే దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలకు తాము సిద్ధమేనని ప్రకటించింది. అయితే బయటి దేశాలనుంచి రాయితీలు రాబట్టే ప్రయత్నంలో భాగంగానే క్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమని అది ప్రకటించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకు రాబోయే రోజుల్లో దక్షిణ కొరియాతో తెగిపోయిన కమ్యూనికేషన్ హాట్‌లైన్‌లను తిరిగి పునరుద్ధరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ గురువారం ప్రకటించడం గమనార్హం. క్షిపణి వాస్తవ సామర్థాన్ని తెలుసుకోవడం కోసం ఈ పరీక్షనిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. సాధారణంగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపిన వెంటనే దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తో పాటుగా అమెరికా కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ధ్రువీకరించేవి. అయితే ఉత్తరకొరియా గురువారం జరిపిన క్షిపణి పరీక్ష గురించి ఆ దేశాలేవీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీన్ని బట్టి ఈ పరీక్షకు అవి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News