Monday, May 13, 2024

రైల్వే శాఖలో 17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి: గెల్లు

- Advertisement -
- Advertisement -

17 Lakh jobs in Railway department

 

కరీంనగర్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఐదేళ్లకు పదవి అప్పగిస్తే మధ్యలోనే వదిలేసిందని టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రచారం చేపట్టారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానిక పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గెల్లు మీడియాతో మాట్లాడారు. తనకు అవకాశం కల్పిస్తే గుండేడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హుజూరాబాద్ నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు మంజూరు చేశారని, ఎందుకు నిర్మించలేదని ఈటెలను ప్రశ్నించారు.

కెసిఆర్ గుండేడు గ్రామానికి మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై మంత్రి కెటిఆర్ శ్వేతపత్రం విడుదల చేశారని, ఒక్క రైల్వే శాఖలో 17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మోడీ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. అనేక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News