Monday, May 6, 2024

జమ్మి పెట్టి జెప్తాన్న.. నాని ‘దసరా’ మోషన్ పోస్టర్ అదిరింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలతో బిజీ ఉన్న నాని దసరా పండుగా సందర్భంగా తన 29వ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు ‘దసరా’ అనే టైటిల్  ఫిక్స్ చేసిన మూవీ మేకర్స్ తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ”ఈ దసరా నిరుడు లెక్క ఉండదు బ్యాంచన్. జమ్మి పెట్టి జెప్తాన్న.. బద్దల్ బాసింగల్ అయితయ్.. ఎట్లైతే గట్లనే చూసుకుందాం” అంటూ నాని చెప్పిన పవర్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కించ‌నున్నాడు.

Nani’s ‘DASARA’ Movie Announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News