వాషింగ్టన్ : కొలంబియా మోస్ట్ వాంటెడ్ మాదక ద్రవ్యాల సరఫరాదారు డైరో ఆంటోనియో సుగా (ఒటోనియల్ )ను అధికారులు అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతన్ని అదుపు లోకి తీసుకోడానికి సైన్యం, వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. అతనిపై ప్రభుత్వం 8 లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించింది. మరో పక్క అతని ఆచూకీ చెబితే 50 లక్షల డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. పశ్చిమకొలంబియా లోని ఆంటికా ప్రావిన్స్‌లో ఆంటోనియోను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు 500 మంది సైనికులు 22 హెలికాప్టర్లు ఉపయోగించారు. ఈ ఆపరేషన్‌లో ఒక భద్రతాధికారి మరణించారు. భద్రతా దళాలను తప్పించుకోడానికి ఆంటోనియో మారుమూల గ్రామాల్లో పలు ఇళ్లను ఏర్పాటు చేసుకొచ్చాడు. అతను ఫోన్ కూడా వినియోగించడు. కేవలం కొరియర్ల కమ్యూనికేషన్ మీదే ఆధారపడతాడు. అతను ఉన్న ప్రదేశంపై రెండు వారాలుగా దళాలు నిఘా వేసి ఆపరేషన్ నిర్వహించాయి.
కొలంబియా మోస్ట్ వాంటెడ్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -