- Advertisement -
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ
న్యూఢిల్లీ: యమునా నదిని 2025 నాటికి ప్రక్షాళన చేసేందుకు ఆరు సూత్రాలతో కూడిన ఒక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రవహించే యమునా నదిని శుద్ధి చేస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని కచ్ఛితంగా అమలు చేస్తామని చెప్పారు. యమునా నదిని ఈ విధంగా కలుషితం కావడానికి 70 ఏళ్లు పట్టిందని, 70 ఏళ్లలో జరిగిన నష్టాన్ని కేవలం రెండు రోజుల్లో పరిష్కరించలేమని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యమునా నదిని ప్రక్షాళన చేస్తామని వాగ్దానం చేశానని, వచ్చే ఎన్నికల నాటికి మీ అందరితోపాటే తాను కూడా యమునా నదిలో స్నానం చేస్తానని కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
- Advertisement -