Thursday, May 2, 2024

తమిళనాడులోని 16 జిల్లాల్లో రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

రాగల 12 గంటలకు వాయుగుండం హెచ్చరిక

చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక జిల్లాల్లో భారీ వర్షం పడినందున పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. కడలూరు,విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లువార్ సహా 16 జిల్ల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. పెరంబూర్, అరియలూర్, ధర్మపురి, తిరుపత్తూర్, వెల్లూర్, రాణిపేట్‌లలో అత్యధిక భారీ వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ శాఖ బుల్లెటిన్ ప్రకారం బంగాళఖాతంలో అల్పపీడన వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి పైన 5.8 కిమీ. మేర సైక్లోనిక్ సర్కులేషన్ విస్తరించి ఉంది. రాగల 12 గంటలలో ఈ అల్పపీడన వాయుగుండం మరింత తీవ్రం కానున్నది వాతావరణ శాఖ హెచ్చరించింది.
చెన్నైలో, దాని సబర్బన్ ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. తాంబరం, మైలాపూర్, వెలాచెరి, అంబత్తూర్, సైదాపేట్, క్రోమ్‌పేట్, రాయపేటై, పారీస్, ఎకాతుతంగల్, కొట్టూర్‌పురం, అడయార్ మెరినాలలో కుండపోత వాన పడుతోంది. చెన్నైలో రెండు, చెంగల్‌పేట్, తిరువల్లూర్, కాంచీపురంలలలో ఒక్కోటి చొప్పున సహాయచర్యలకుగాను జాతీయ విపత్తు నిర్వహణ బలగం(ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను మోహరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News