దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెఎల్.రాహుల్ ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్ నుంచి వైదొలిగాడు. భారత్ తరఫున రాహుల ఒక్కడే తొలి పది ర్యాంకుల్లో నిలిచాడు. రోహిత్ శర్మ 13వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన రోహిత్ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఇక రాహుల్ తన ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. విరాట్ కోహ్లి 11వ ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో నిలకడగా రాణించడంతో ఆజమ్‌కు తొలి ర్యాంక్ వరించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ మూడో, మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగా(శ్రీలంక) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తబ్రేస్ షంసి రెండో, ఆడమ్ జంపా మూడో, ఆదిల్ రషీద్ నాలుగో, రషీద్ ఖాన్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు.
ICC T20 Rankings 2021: KL Rahul moves up to 5th spot