Tuesday, April 30, 2024

రాహుల్ కు తగ్గని గాయం… ఇంగ్లాండ్ కు పయనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ కండరాల నొప్పితో గత కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తొడ కండరాల పట్టేయడంతో అతడు మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత 20 రోజుల నుంచి బిసిసిఐ వైద్య బృందం అతడికి చికిత్స అందిస్తోంది. ధర్మశాల వేధికగా ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆడుతాడని అందరూ భావించారు. ప్రాక్టీసు చేస్తుండగా మళ్లీ గాయం తిరగబెట్టడంతో బిసిసిఐ వైద్యం బృందానికి ఏం చేయాలో తోచడం లేదు. రాహుల్‌ను లండన్ పంపించేందుకు బిసిసిఐ సిద్ధమైనట్టు సమాచారం.

వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో వికెట్ కీపింగ్ చేయడంతో రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతోనే అతడు తొడ కండరాల పట్టేసినట్టు సమాచారం. రాహుల్ రిపోర్ట్‌ను ఇంగ్లాండ్ వైద్యులకు పంపించారు. ఇంగ్లాండ్‌లో చికిత్స తీసుకోవాలని లండన్ వైద్యులు సూచించారు. దీంతో రాహుల్ ఇంగ్లాండ్ కు పయనమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ ఇప్పటికే 3-1 తేడాతో ముందంజలో ఉంది. ఇప్పటికే బౌలర్ షమీ గాయపడిన లండన్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News