Monday, June 10, 2024

తోట తరణికి ‘హరిహర వీరమల్లు’ కళా దర్శకత్వ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణి కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం తోట తరణి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. తోట తరణి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి,అధ్యయన అభిలాషకు అద్దంపడతాయన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తరణితో తనకు మంచి పరిచయం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News