Sunday, September 21, 2025

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఓటేసిన 105 ఏళ్ల బామ్మ

- Advertisement -
- Advertisement -

 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నరోదేవీ అనే 105 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంది. చౌరా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ 122 వద్దకు వచ్చి ఓటు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రాష్ట్రానికి చెందిన ‘భారత్ తొలి ఓటర్’ శ్యామ్ శరణ్ నేగి (105) ఇటీవల కన్నుమూసిన ముచ్చట తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. హిమాచల్ రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. 400 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నమోదు కానుంది. ఈ మధ్యాహ్నం 1 గంటల వరకు దాదాపు 37% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News