Friday, September 19, 2025

కెసిఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -
  • జడ్పిటిసి పట్నం అవినాష్‌రెడ్డి

షాబాద్: కెసిఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని లకా్ష్మరావుగూడ, తాళ్లపల్లి, ఏట్ల ఎర్రవల్లి, తదితర గ్రామాల్లో పల్లెపల్లెకు పట్నం అవినాష్‌రెడ్డి కార్యక్రమంను నిర్వహించారు. ఆనంతరం ఆయా గ్రామాలల్లో బిఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించే విధంగా చూస్తామన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తుడు నగేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News