Monday, May 13, 2024

చంద్రయాన్–3 కౌంట్‌డౌన్ స్వరం ఇక వినిపించదు: ఇస్రో శాస్త్రవేత్త వలర్‌మతి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై: చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు పెట్టే సమయంలో జరిగే కౌంట్‌డౌన్ వెనుక వినవచ్చే విశిష్ట స్వరం మూగవోయింది. రాకెట్ ప్రయోగాల కౌంట్‌డౌన్ వినిపించే ఇస్రో శాస్త్రవేత్త వలర్‌మతి శనివారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.

శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించే భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్లకు ఇక వలర్‌మతి మేడమ్ స్వరం ఇక వినిపించదు. చంద్రయాన్–3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఆమె హఠాన్మరణం అత్యంత బాధాకరం..ప్రణామాలు.. అంటూ ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పివి వెంకటకృష్ణన్ ఎక్స్(ఇఒకప్పుడు ట్విట్టర్)లో పోస్టు చేశారు.

1959 జులై 31న తమిళనాడులోని అరియలూరులో వలర్‌మతి జన్మించారు. ఇస్రోలో ఆమె 1984లో చేరారు. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానతంతో రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం ఇరిశాట్–1కు ఆమె ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News