Friday, November 1, 2024

అబద్ధాల షా

- Advertisement -
- Advertisement -
అమిత్‌షా ప్రసంగం ఆసాంతం..అసత్యాలే

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. అమిత్ షా తనకు అలవాటైన అబద్దాలను మరోసారి వల్లే వేసే ప్ర యత్నం చేశారని మండిపడ్డారు. మంగళవా రం అదిలాబాద్‌లో జరిగిన బిజెపి జనగర్జన సభలో కేం ద్ర మంత్రి అమిత్ షా ప్రసంగంపై స్పందిస్తూ మంత్రి కె టిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయని భారతీ య జనతా పార్టీ, ఈరోజు అడ్డగోలు ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. అమిత్ షా ప్రసంగాన్ని చూసి ప్ర జలు నవ్వుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు. కేవ లం ఎన్నికల వేళ చేసే భారతీయ జనతా పార్టీ జూ మ్లా లు, అబద్దాలను విని విని దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, వాటిని నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని అన్నారు. దేశంలో పెరిగిన ధరల గురించి, పెరిగిన నిరుద్యోగం గురించి మాట్లాడితే మం చిదని సూచించారు. అమిత్ షాకు దమ్ముంటే అదాని గురించి మాట్లాడాలని నిలదీశారు. ప్రధాని మోడీ, అమిత్ షా లు 100 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అబద్ధాలకు ప్రభావితమయ్యే అవకాశం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజ లు బిజెపికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణకు అగ్రస్థానమా…పచ్చి అబద్ధం
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందం టూ పచ్చి అబద్దాన్ని అమిత్ షా చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకమైన రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా  నిలిచిన విషయాన్ని కెసిఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ స్ఫూర్తి గా రైతుబంధు కార్యక్రమాన్ని కాపీ కొట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం తెలంగాణ గడ్డ నుంచి అబద్దాలు ఆడారని మండిపడ్డారు. కేం ద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షా…ఇలా అడ్డగోలుగా అబద్ధాలు ఆడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇదే అమిత్ షా ఐదు సం వత్సరాల కింద ఆదిలాబాద్ జిల్లాలో ప్రసంగిస్తూ అదిలాబాదులో మూతపడి న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారని, ఐ దు సంవత్సరాలు గడిచినా ఆ హామీపై ఒక్క అడుగు కూడా బిజెపి ప్రభుత్వం ముందుకు వేయలేదని విమర్శించారు. ఇలాంటి నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ఉండడం తెలంగాణ రాష్ట్ర దురదృష్టం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల గడుస్తున్నా తెలంగాణకు చట్టప్రకారం దక్కాల్సిన ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వారి ధ్వందనీతికి అద్దం పడుతుందని విమర్శించారు. చట్ట ప్రకారం జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉన్నా, అటు పాఠశాల నుంచి మొదలుకొని వైద్య కళాశాల, యూ నివర్సిటీ వరకు ఇప్పటి వరకు ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణ రా ష్ట్రంలో ఏర్పాటు చేయలేదని అన్నారు. సంవత్సరాల కిందనే గిరిజన యూనివర్సిటీకి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినా ఇప్పటిదాకా యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదని చెప్పారు.
ఒక్క బిజెపి పాలిత రాష్ట్రమైనా తెలంగాణతో పోటీ పడుతుందా..?
ఎన్నికల ముందు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ఎన్నికల ప్రకటనలను తెలంగాణ ప్రజలు నమ్మరని కెటిఆర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న అమిత్ షా కు దమ్ముంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ కంటే గొప్పగా అభివృద్ధి చెందిన ఒక్క రాష్ట్రాన్ని అయినా చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థూల ఆదాయం, తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిలు ఇలా అన్ని రంగా ల్లో తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందని, మరి బిజెపి ఆధ్వర్యంలో న డుస్తున్న ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణతో పోటీ పడుతుందా అంటూ కెటిఆర్ సవాల్ విసిరారు. ఈ విషయంలో తన సవాలు స్వీకరించాలని కోరారు.
పరివార్ వాద్ గురించి మాట్లాడితే ప్రజలు పరిహసిస్తున్నారు
కుటుంబ పాలన పైన అమిత్ షా మాట్లాడితే దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో అమిత్ షా కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎక్కడ ఎవరికి కోచింగ్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా బి సిసిఐ సెక్రటరీగా ఉన్న కొడుకు విషయంలో ఉన్న పరివార్ వాద లబ్ది గు రించి అమిత్ షా మాట్లాడితే మంచిదని అన్నారు. అమిత్ షా లాంటి నాయకులు పరివార్ వాద్ గురించి మాట్లాడితే ప్రజలు పరిహసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో పదేపదే తిరిగి ఎన్నికవుతున్న నాయకుల గురించి, కుటుంబ పాలన పేరుతో ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షా లాంటి వారికి లేదని అన్నారు.
పదేళ్లలో తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలి
భారత రాష్ట్ర సమితి కారు స్టీరింగ్ ముమ్మాటికి మా చేతుల్లోనే ఉందని… ప్రధాని, భారతీయ జనతా పార్టీ స్టీరింగ్ మాత్రం ముమ్మాటికి ఆదాని చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని కెటిఆర్ చురకలంటించారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్ షా కు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పకుండా దాచి ఉంచారేమో అని కెటిఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ విషయంలో అమిత్ షా తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. అమిత్ షాకు, భారతీయ జనతా పా ర్టీ కి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలు ఏం చేసిందో చె ప్పి, ప్రజలకు వివరించి వారి మద్దతు కోరాలని పేర్కొన్నారు. తెలంగాణ రా ష్ట్రానికి చేసింది ఏం లేకపోవడంతో, అది చెప్పుకునే ధైర్యం లేక కేవలం మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గ పు రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కచ్చితంగా బిజెపి పార్టీకి బుద్ధి చెబుతారని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News