Tuesday, September 23, 2025

తాజాగా మరో వివాదంలో ‘కన్నప్ప’.. క్లారిటీ ఇచ్చిన విష్ణు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కన్నప్ప’(Kannappa Movie). ఈ సినిమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఓ వర్గం ఆందోళన చేపట్టింది. సినిమాలో పేర్లను తొలగించకపోతే.. సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆందోళన చేపట్టారు.

తాజాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా సినిమాను తెరకెక్కించామని ఆయన అన్నారు. సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని.. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని ఆయన పేర్కొన్నారు. సన్నివేశాలు తెరకెక్కించే ముందు ప్రతి రోజు భక్తితో పూజలు చేశామని.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నామని అన్నారు. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే వేదాధ్యయనం చేసిన వారితో పాటు, పలువురు ఆధ్యాత్మిక వేత్తల నుంచి సూచనలు తీసుకున్నామని తెలిపారు. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడమే కన్నప్ప (Kannappa Movie) సినిమా వెనుక ఉన్న అసలు ఉద్దేశమని.. అంతేకానీ, వివాదాలు కాదని అన్నారు. సినిమా విడుదల అయ్యే వరకూ ప్రతీ ఒక్కరు ఓపికతో ఉండాలని.. విడుదలకు ముందే ఓ నిర్ణయానికి రాకండి అంటూ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News