Tuesday, June 24, 2025

హార్మూజ్ ఎఫెక్ట్.. చమురు నౌకల యుటర్న్

- Advertisement -
- Advertisement -

హార్మూజ్ జలసంధి రవాణా మార్గం మూసివేత హెచ్చరికల ప్రభావం పడింది. రెండు మిలియన్ బారెల్స్ ముడిచమురుతో ఈ మార్గం గుండా వెళ్లాల్సిన రెండు భారీ నౌకలు తిరిగి వెనకకు వెళ్లాయి. ఇరాన్ ఈ మార్గం నిలిపివేతకు ఆదేశాలు వెలువరించక ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం కాస్‌విజ్‌డమ్ లేక్, సౌత్ లాయాల్టీ సూపర్‌ట్యాంకర్లు ముందు ఈ జలసంది మార్గంలోకి ప్రవేశించాయి. ఈ దశలోనే ఈ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకోవడం,

ఏ క్షణంలో అయినా నిర్ణయం అమలు కానున్న దశలోనే ఈ భారీ నౌకలు వెనుతిరిగాయని వెల్లడైంది. ఈ నౌకల యుటర్న్ వివరాలను బ్లూమ్‌బెర్గ్ సేకరించిన ట్రాక్ రికార్డు ద్వారా తెలిసింది. పర్షియన్ గల్ఫ్‌లోకి ఏ రవాణా నౌక చేరుకోవాలనుకున్నా ముందుగా ఇరాన్ పరిధిలోని ఈ జలసంధి ద్వారా వెళ్లాలి. ఈ రూట్‌కు వెళ్లకుండా వేరే దారుల ద్వారా వెళ్లేందుకు రవాణా నౌకలు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకోవల్సి ఉంది. ఇప్పటికే జపాన్ ఇతర దేశాల రవాణా నౌకలు యుటర్న్ దిశలో ఆలోచిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News