బర్మింగ్‌హామ్: టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మాన్ గిల్, మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. దీర్ఘకాలంగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఈ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 2019లో పూణేలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ అజేయంగా 254తో బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో గిల్ ఇంగ్లాండ్‌పై అద్భుతమైన డబుల్ సెంచరీతో కోహ్లీ రికార్డును తిరగరాశాడు. అంతేకాదు.. ఈ డబుల్ సెంచరీతో గిల్ పలు రికార్డులను నెలకొల్పాడు. ఉపఖండం వెలుపల అత్యధిక పరుగులు చేసిన భారతీయుడి గిల్ నిలిచాడు. అలాగే, ఇంగ్లాండ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును కూడా గిల్ బద్దలు కొట్టాడు. గ్రేమ్ స్మిత్ తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా కూడా గిల్ నిలిచాడు.
విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన గిల్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -