Friday, July 4, 2025

మొదటి ఓవర్‌-ఇయర్‌ ఆడియా హెడ్ ఫోన్(1)ను ఆవిష్కరించిన నథింగ్

- Advertisement -
- Advertisement -

లండన్‌ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ కంపెనీ Nothing, రెండు సరికొత్త ఉత్పత్తులు – తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ Nothing Phone (3), మొట్టమొదటి ఓవర్‌-ఇయర్‌ ఆడియో ఉత్పత్తి Headphone (1)ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్టు నేడు ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగదారులు తిరిగి ఊహించుకునేలా ఉద్దేశపూర్వక డిజైన్, గొప్ప సృజనాత్మకతతో కూడిన ఈ రెండు ఉత్పత్తులు Nothing దార్శనికతను ప్రతిబింబిస్తాయి.

నథింగ్ ఫోన్(3)

స్మార్ట్‌ ఫోన్‌ పనితీరు, వ్యక్తికరణలో కొత్త శకాన్ని పరిచయం చేస్తుంది Nothing Phone (3). సాంకేతికతను మరోసారి వ్యక్తిగతంగా అనుభూతి చెందేలా డిజైన్‌ చేసిన ఈ ఫోన్‌లో ప్రో-గ్రేడ్‌ ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్‌తో పాటు ఈ శ్రేణిలో ఎక్కువ, తక్కువ లైట్‌ షాట్స్‌ కోసం అగ్రశేణి 1/1.3” మెయిన్‌ సెన్సర్‌, లాస్‌లెస్‌ ఆప్టికల్‌ జూమ్‌, పూర్తి ఇమేజ్‌ స్థిరత్వం కోసం అన్ని లెన్సుల్లో సినిమాటిక్‌ 4K 60fps వీడియో ఉంది. ప్రీమియం మాడ్యూలార్‌ డిజైన్‌లో అల్ట్రా-న్యారో బెజిల్స్‌తో అద్భుతమైన 6.67″ ఆమోలెడ్‌ డిస్‌ప్లే, శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్‌ ® 8s జెన్ 4 చిప్‌ ఉంది. గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌తో యూజర్లు ముఖ్యమైన సమాచారాన్ని ఒక చూపులోనే పొందవచ్చు. అంతే కాదు ఫ్లిప్‌ టు రికార్డు, గ్లిఫ్‌ బొమ్మలతో సరదా అనుభూతులను ఆస్వాదించవచ్చు. సరికొత్త ట్రై-కాలమ్‌ లేఔట్‌తో కూడిన ఫోన్ (3)లో రీ-డిజైన్ చేసిన R-యాంగిల్ అందాన్ని మెరుగుపరుస్తుంది. ముందు భాగంలో ఏకరీతి 1.87 ఎంఎం బెజెల్స్‌తో ఫోన్ (2) కంటే 18% సన్నగా, పదునుగా, మరింత మైమరపింపజేసే ఆమోలెడ్‌ స్క్రీన్‌ కలిగి ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ 15, ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ Nothing ఓఎస్‌ 3.5తో ఉంటుంది Nothing Phone (3). Nothing ఓఎస్‌ 3.5 ఎసెన్షియల్‌ స్పేస్‌, ఎసెన్షియల్‌ సెర్చ్ వంటి ఏఐ-ఆధారిత ఫీచర్లు అందిస్తూ యూజర్లు తమకు నచ్చినట్టుగా ఫోకస్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండేలా చూడటంలో సాయపడుతుంది. భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్‌ 16తో పాటు 2025 మూడో త్రైమాసికంలో వచ్చే ఓఎస్‌ 4.0కి ఇది సిద్ధంగా ఉంటుంది. దీర్ఘకాలం కోసం కట్టుబడి ఉండే Nothing ఆండ్రాయిడ్‌కు సంబంధించిన ప్రధాన అప్‌డేట్స్‌ను 5 సంవత్సరాల వరకు, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ 7 సంవత్సరాల వరకు అందిస్తూ డిజైన్‌, అనుభూతి రెండింటిపరంగా చిరకాలం నిలిచేలా ఫోన్ (3) ఉంటుంది. 5500 mAh హై-డెన్సిటీ బ్యాటరీ, 65W ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, IP68 రేటింగ్‌తో ఫోన్‌ (3) దేనికైనా సిద్ధంగా నిలిచి ఉంటుంది.

నథింగ్ హెడ్‌ఫోన్‌ (1)

Nothing Headphone (1) ద్వారా ఓవర్‌-ఇయర్‌ ఆడియో కేటగిరీలోకి నథింగ్‌ ప్రవేశిస్తోంది. KEF సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తి ఆకట్టుకునే డిజైన్‌, కచ్చితమైన ఇంజినీరింగ్‌కు మేళవింపు. కస్టమ్‌ 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్ నుంచి హెడ్‌ ట్రాకింగ్‌తో రియల్‌ టైమ్‌ స్పాటియల్‌ ఆడియో వరకు ఇది మైమరపింపజేసే లోతైన శ్రవణానుభూతిని అందిస్తుంది. అల్యూమినియం, PU మెమొరీ ఫోన్‌ సహ ప్రీమియం పదార్ధాల సమ్మేళనంతో కూడిన ఈ ఉత్పత్తి రోజంతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులోని ది రోలర్‌, ప్యాడిల్‌, బటన్‌ – సిగ్నేచర్‌ టాక్టైల్‌ కంట్రోల్స్‌ వ్యాల్యూమ్, మీడియా, ANCలో నిరంతరాయ నియంత్రణను అందిస్తాయి.

రోజంతా వింటూ ఉండే నిర్మాణంతో పాటు ఆడియోఫైల్‌ గ్రేడ్‌ పనితీరుతో Nothing HeadPhone (1) హై-రెజల్యూషన్‌ ఆడియో, LDAC, USB-C లాస్‌లెస్‌ ప్లేబ్యాక్‌, 3.5 ఎంఎం వైర్డ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ANCలో ఇది 35 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ కలిగి ఉంటుంది, 5 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌తో 2.4 గంటల పాటు దీనిని వినవచ్చు. డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ, ఏఐ శక్తితో కాల్‌ క్లారిటీ, ఛానెల్‌ హాప్‌ వంటి ఇన్‌-యాప్‌ కస్టమైజేషన్‌, అడ్వాన్స్‌డ్‌ EQ వంటివి సౌకర్యంతో పాటు వ్యక్తిగతీకరణను అందిస్తాయి.

Nothing Phone(3) ధర:
రెండు కాన్ఫిగరేషన్ రకాలు, బ్ల్యాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌తో ఫోన్‌ (3) అందుబాటులో ఉంది:

● 12 జీబీ + 256 జీబీ – ప్రారంభ ధర రూ.62,999 (బ్యాంక్‌ ఆఫర్‌ సహ + ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌*)

● 16 జీబీ + 512 జీబీ – ప్రారంభ ధర రూ. 72,999 (బ్యాంక్‌ ఆఫర్‌ సహ + ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌*)

● Nothing Phone (3) ప్రీ-బుకింగ్‌ జులై 1, 2025 ప్రారంభమైంది. ప్రత్యేక లాంఛ్‌ ఆఫర్‌గా, ప్రీ-బుక్‌ చేసుకున్న కస్టమర్లు నథింగ్ ఇయర్‌ (విలువ రూ.14,999) ఉచితంగా ఫోన్‌ (3)తో అందుకుంటారు.

● Nothing Phone (3) ప్రీ-బుక్‌ చేసుకునే వినియోగదారులు లేదా జులై 15న ఫోన్‌ కొనుగోలు చేసేవారు ఒక సంవత్సరం అదనపు వారెంటీ అందుకుంటారు.

● ప్రముఖ బ్యాంకుల ద్వారా 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా నథింగ్ అందిస్తోంది.

లభ్యత:

● జులై 15, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్, విజయ్‌ సేల్స్, క్రోమా సహ అన్ని ప్రముఖ రిటెయిల్‌ స్టోర్స్‌లో Nothing Phone (3) అమ్మకాలు ఉంటాయి.

Nothing Headphone(1):

ధర:
● భారతీయ మార్కెట్‌లో బ్ల్యాక్‌ అండ్‌ వైట్‌ రకాల్లో రూ.21,999లకు HeadPhone (1) అందుబాటులో ఉంటుంది. ప్రవేశపెడుతున్న సందర్భంగా జులై 15, 2025న ప్రత్యేకంగా రూ.19,999కే దీనిని పొందవచ్చు.

● ప్రముఖ బ్యాంకుల ద్వారా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ నుంచి కూడా 12 నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్స్‌ను నథింగ్‌ సమకూర్చుతుంది.

లభ్యత:
● జులై 15, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్, విజయ్‌ సేల్స్, క్రోమా సహ అన్ని ప్రముఖ రిటెయిల్‌ స్టోర్స్‌లో Nothing Headphone (1) అమ్మకాలు ఉంటాయి. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి జాబితాను nothing.tech లో చూడవచ్చు. లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్, Xలో దయచేసి నథింగ్‌ ఇండియాను ఫాలో అవండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News