Friday, July 4, 2025

రాజకీయ పబ్బం కోసం బిఆర్‌ఎస్ ప్రయత్నం: ముద్రగడ వంశీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌ః రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి చంద్రబాబు జపం జేస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోకన్వీనర్ ముద్రగడ వంశీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆపార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బనకచర్ల పేరుతో బిఆర్‌ఎస్ చంద్రబాబుపై బురద జల్లుతుందని, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధిలో నడిపించాలని ఆశీస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బిఆర్‌ఎస్‌లో ఇంటిపోరు కలవరపెడుతుందని అందులో భాగంగానే హరీష్‌రావు బనకచర్ల, కవిత బీసీలు, కేటిఆర్ హైద్రాబాద్‌పై ప్రేమలు కురిపిస్తు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.

తెలంగాణ ప్రజలపై బిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి వుంటే కాంగ్రేస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలో హుందాగా వుండి ప్రత్యర్ధి పార్టీలు కాంగ్రేస్, బిజేపిపై పోరాటం చేయాలని, అలా కాకుండా వ్యక్తులను టార్గేట్ చేస్తూ ఆరోపనలు చేయడం బిఆర్‌ఎస్‌కు సమంజసం కాదన్నారు. గడిచిన కొంతకాలంగా తెలంగాణలో టిడిపి అధికారంలో లేకున్న చెక్కుచెదరలేదని కార్యకర్తలు బలంగా వున్నారన్నారు. క్రమశిక్షణ మారుపేరైన టిడిపిపై బురదజల్లాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షులు పాలమూలు బాలకృష్ణ, కార్యదర్శి దేశావతి శ్రీహరి, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్‌బాబు, సీనియర్ నాయకులు అయ్యోరి నాగరాజు, కంది రవి, శ్యామ్‌తివారి, నర్సయ్య, దేవరకొండ నవీన్, రాజేష్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News