మనతెలంగాణ/రాయికల్ః రాయికల్ మంలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో నూతనంగా నిర్మింస్తున్న
హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి పనులు సకాలంలో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం హెల్త్ సబ్ సెంటర్ల పనుల నిర్మాణాన్ని పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే రాయికల్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖి చేసి ఓపి సేవలు, ల్యాబ్ రికార్డు, పార్మసి రూం, ఆసుపత్రిలో ఇన్పేషంట్ల, ఆవుట్ పేషంట్ల వివరాలు అడిగి తెలుసుకన్నారు. వచ్చే పేషంట్లకు మెరుగైనవైద్యం అందించాలని కోరారు.వైద్యులు ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని అన్నారు.రోగులకు డైట్ పుడ్ అందించాలని,పాలు ఇడ్లి బ్రెడ్ ప్రూట్స్ పోషక ఆహార పదార్దాలు అందించాలి.ముందస్తు వర్షకాల సీజనల్ వ్యాధులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డెంగ్యూ మలేరియా రాకుండా ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.బోర్నపల్లి గ్రామంలో యుపిఎస్,ప్రైమరీ స్కూల్ పాఠశాలలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని అధికారులను ఆదేశించారు.పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తోలగించి,శుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు.మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పాటించి,విద్యార్దుల మోను ప్రకారం భోజనం అందించాలన్నారు.అదే విధంగా కిచెన్ గార్డెన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో భోదించే ఉపాధ్యాయుల విధానం, విద్యార్దులకు భోధించే విధానంను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్దుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి,తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఈపిఆర్వో లక్ష్మణరావు, కమిషనర్ మనోహర్, తహసిల్దార్ నాగార్జున,ఎంపిడివో చిరంజివి,ఎంపివో సుష్మ,మేనేజర్ వెంకట్, వివిధ విభాగాల అధికారులు పాల్గోన్నారు.