Tuesday, August 5, 2025

‘ఏ ఫర్ అఖిలేశ్.. డి ఫర్ డింపుల్’.. సమాజ్‌వాదీ నేతలపై కేసు

- Advertisement -
- Advertisement -

లక్నో: సాధారణంగా ఏ పాఠశాలల్లో అయినా విద్యార్థులకు ‘ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్’ అని బోధిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని పీడీఎ పాఠశాలల్లో మాత్రం ఏ ఫర్ అఖిలేశ్, బీ ఫర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డి ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ బోధించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ సహారన్‌పుర్ లోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వం పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతాల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతలు పీడీఎ పాఠశాలలు ఏర్పాటు చేశారు. స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత ఫర్హాద్ ఆలం గడా ఆ పాఠశాలల్లో విద్యార్థులకు ఏ ఫర్ అఖిలేశ్, బీ ఫర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డి ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అని బోధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో అక్షరాలను రాజకీయాల కోసం వినియోగిస్తున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆయా పాఠశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వారు పిల్లలకు బోధిస్తున్న పాఠాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ విద్యార్థులకు చదువు చెప్పడంపై బ్రిటిషు వారు పాలించిన సమయంలో కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని అన్నారు. తమపై తప్పడు ఆరోపణలు చేస్తూ తాము నడిపిన పాఠశాలలను మూసి వేయించడానికి ఇది బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అన్నారు. ఈ చర్యలతో విద్యకు బీజేపీ ఎంత వ్యతిరేకమో ప్రజలకు అర్థమవుతోందని దుయ్యబట్టారు. తమ పాఠశాలల్లో విద్యతోపాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తుల గురించి అవగాహన కల్పిస్తున్నట్టు పార్టీ నేత ఫర్హాద్ ఆలం గడా పేర్కొన్నారు. బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టడంతో భయపడి ఆగిపోమని, జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News