Tuesday, August 5, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం కురిసేల గ్రామానికి చెందిన కార్తీక్(18), ఉదయ్ కిరణ్(17), జగన్(16) స్కూటీపై వెళ్తుండగా.. కొమరాడ పోలీస్‌ స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద లారీ వచ్చి ఢీకొట్టి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురిలో కార్తీక పాలిటెక్నీక్ కోర్సు చేస్తుండగా.. ఉదయ్ కిరణ్ ఇంటర్ సెకండ్ ఇయర్, జగన్ ఫస్టియర్ చదువుతున్నారు. ఉదయ్ కిరణ్, కార్తీక్‌లో అన్నదమ్ములు కాగా, జగన్ బావబావమరిది వరస అవుతాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకేసారి మృతి చెందడతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News