Tuesday, August 5, 2025

ఇంట్లో పేలిన సిలిండర్…. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిలిండర్ పేలి ఒకరు మృతి చెందిన సంఘటన మేడ్చల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ లో జనం ఇటు అటు తిరుగుతున్నారు. మాజీ ఎంపిటిసి మురళీ ఇంట్లో మొబైల్ షాపుతో పాటు రెండు పూల దుకాణాలు ఉన్నాయి. మురళీ ఇంట్లో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు దినేష్, రఫిక్, తిరుపతమ్మగా గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News