Tuesday, August 5, 2025

పెళ్లి జరిగిన రాత్రే నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో ఉదయం వివాహం చేసుకొని సాయంత్రం నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… సోమందేపల్లి మండల కేంద్రంలో కృష్ణమూర్తి, వరలక్ష్మీఅనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు హర్షితా(22) అనే అమ్మాయి ఉంది. కర్నాటకలోని బాగేపల్లి ప్రాంతం దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో హర్షిత వివాహం సోమవారం ఉదయం జరిపించారు. తొలి రాత్రి సోమందేపల్లిలో నిర్వహించేందుకు ఏర్పాట చేశారు. తన గదిలోకి వెళ్లిన వధువు బయటకు రాకపోవడంతో తలుపు తట్టి చూశారు. గదిలో నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. గది పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే నవ వధువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటివరకు వివరాలు తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News