- Advertisement -
పెద్దపల్లి: కాళేశ్వరం నివేదిక లీకులను పట్టించుకోమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెట్టిన తర్వాతే స్పందిస్తామని, కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానిదా..కాంగ్రెస్‌దా అని చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బిజెపి చెబుతుందన్నారు. సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, బిసి జాబితాలో ముస్లింలను కలపొద్దని కాంగ్రెస్ ను కోరారు. కాంగ్రెస్ కు బిసిలపై ప్రేమ ఉంటే మహేశ్వర్ గౌడ్ ముఖ్యమంత్రిని చేయాలని రాంచందర్ రావు పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -