- Advertisement -
మొహాలీ: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో (Punjab Mohali) ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఉండే ఫేజ్ 9 ప్లాంట్‌లో బుధవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైద్య, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో సిబ్బంది ఉండటంతో ప్రమాదంలో మరణించిన వాళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫేజ్ 6లో సివిల్ ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల తెలిపారు.
- Advertisement -