Friday, August 8, 2025

సుంకాలకు బెదరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశం ప్రయోజనాలు, భారతీయ రైతుల ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అందుకు ఎంత మూల్యం చెల్లించడానికైనా వెనుకాడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై 50శాతం సుంకాలను వి ధించిన ట్రంప్ ఇదే మా సమాధానం అని ప్రధాని వెల్లడించారు. ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది ఉత్సవాలో బాగంగా ఓ అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని ప్రసంగించా రు. భారతీయ రైతులకు అండగా నిలుస్తూ నే, అమెరికా విధించిన సుంకాల భారాన్ని ఎదుర్కొంటామని మోది అన్నారు. మాకు మా రైతుల  ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. భారతీయ రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని నరేంద్ర మోదీ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వైఖరి వల్ల భారీ మూల్యం చెల్లించాల్సివస్తుందని తనకు వ్యక్తిగతంగా తెలుసునని అందుకు తాను, భారతదేశం కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

భారతీయ వస్తువులపై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకం విధించిన తర్వాత మొత్తం సుంకాలు 50 శాతం చేరిన నేపథ్యంలో నరేంద్రమోదీ స్వరంలో ధిక్కారం సుస్పష్టమైంది. అమెరికా ఏ దేశం పైనా ఇంత అత్యధికంగా సుంకాలు విధించలేదు. రష్యా నుంచి చమురు, సైనిక సామగ్రి కొనుగోలులో అమెరికా ఆంక్షలకు కట్టుబడి ఉండేందుకు భారతదేశం స్పష్టంగా నిరాకరించడంతో శిక్షగా ట్రంప్ ప్రత్యక్ష చర్యకు పూనుకొన్నారని తేటతెల్లం అయింది. దీని వల్ల భారత- అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతినడం ఖాయం అని భావిస్తున్నారు. భారతదేశాన్ని అత్యంత మిత్రదేశం అని పిలుస్తూనే, ట్రంప్ కొన్నిరోజులక్రితం రష్యాతో సంబంధాలు కొససాగిస్తే చర్య తప్పదని హెచ్చరించారు. మొదట 25 శాతం మేరకు సుంకాలు వడ్డిస్తూ, గత బుధవారం మరో 25 శాతం సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. డోనాల్డ్ ట్రంప్ చర్యను తీవ్రంగా గర్హిస్తూ, ఇది అన్యాయం, అసమంజసం అని భారత ప్రభుత్వం అభివర్ణించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన

అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రష్యన్ చమురు దిగుమతుల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూనే ఆ దేశంతో యురేనియం, హెక్సాఫ్లోరైడ్ పల్లాడియం, ఎరువులను కొనుగోలు చేయడం విశేషం. భారతీయ రైతులు, మత్స్యకారులు, పాడి రైతులను దెబ్బతీసేవిధంగా అమెరికా వ్యవసాయ మార్కెట్ లో డిజిటల్ వాణిజ్య రంగాలపై నియమాలను వదులుకోడానికి భారతదేశం నిరాకరించడంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు గండి పడింది. ఈ చర్చలు విఫలం కావడంతో సుంకాల కొరడా ఝుళిపించడం అమెరికా నిరాస నిసృ్పహలను ప్రతిబింబిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News