Friday, August 8, 2025

కెసిఆర్‌ను ఎందుకు జైలులో వేస్తా?

- Advertisement -
- Advertisement -

ఫాంహౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా
ఏముంది? బిఆర్‌ఎస్ నేతలకు నైతికత
గురించి మాట్లాడే అర్హత లేదు కేంద్రం
బిల్లును ఆమోదించకపోతే స్థానిక సంస్థల
ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తాం
గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం
మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటాం
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి
చేయడానికి పదిరోజులు చాలు బీహార్
ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప
ఎన్నిక ఢిల్లీలో విలేకరులతో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్‌ను తానేందుకు జైలులో వేస్తానని, కెసిఆర్ జైలులో ఉన్నట్టుగానే ఫాంహౌస్ లో ఉన్నారని కెసిఆర్ ఫాంహౌస్‌కు, చర్లపల్లి జైలుకు తే డా ఏముందని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్‌ను ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష అని, తాను వి ద్వేష రాజకీయాలు చేయడం లేదని బిఆర్‌ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం బిల్లును ఆమోదించక పోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని ఆయన చెప్పారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటామన్నా రు. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు చాలనీ, కోర్టు తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే స్థానిక ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు కేవలం 10 రోజుల సమయం చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నిబద్ధత నిరూపించుకుంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లపై కాం గ్రెస్ కమిట్‌మెంట్ నిరూపించుకుందన్నారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని ఆయన తెలిపారు. తమ పోరాటం కేంద్రంతోనే అని, అందుకే జంతర్ మంతర్ వద్ద తమ గొంతు వినిపించామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ ఆర్డినెన్స్ తెచ్చినందునే దానిని సవరించిన ము సాయిదాను గవర్నర్‌కు పంపామని ఆయన తెలిపారు. మోడీ చేతుల్లోనే బిసి రిజర్వేషన్ నిర్ణయం ఉందని, రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదని, మోడీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా ఆ విషయమైనా చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మా వాణిని బలంగా వినిపించాం
బిసిలపై ప్రేమ ఉంటే బిసి బిల్లును కేంద్రం ఆమోదించాలని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలన్నది తమ కమిట్‌మెంట్ అని ఆయన అ న్నారు. రిజర్వేషన్ సాధనకోసం తాము చేయాల్సింది చే శామన్నారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాలా ఈ ప్రక్రియను పూర్తి చేశామని రేవంత్ తెలిపారు. ప్రస్తుతం బిసిల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బిసిలకు న్యాయమైనా వాటా కోసమే తమ పోరాటమని సిఎం రేవంత్ చెప్పారు. జంతర్ మంతర్ వేదికగా తమ వాణీ బలంగా వినిపించామన్నారు. జంతర్ మంతర్ ధర్నాపై బిజెపి, బిఆర్‌ఎస్ నేతల విమర్శలు విడ్డూర మ న్నారు. తమ కమిట్‌మెంట్‌కు వాళ్ల సర్టిఫికెట్ అవసరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టబోమని అది తమ నైజం కాదన్నారు. బిసిలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేడమే తమ టార్గెట్ అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News