Saturday, August 9, 2025

వేరుసెనగ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటుండగా రెండేళ్ల బాలుడు గొంతులో వేరుసెనగ ఇరుక్కొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటరెడ్డిపల్లిలో నాగరాజు, జ్యోతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దంపతులు వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. చిన్న కుమారుడు దీపక్ అలియాస్ బిట్టు (02) నోట్లో వేరుసెనగ వేసుకున్నాడు. గొంతులో ఇరుక్కోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News