Sunday, August 10, 2025

అది జరగలేదని కెటిఆర్ ప్రమాణం చేస్తావా?… నేను చేయడానికి రెడీ: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మీరు నాకు రక్ష ! నేను మీకు రక్ష ! మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష !! అంటూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలనే చేప్పే దీక్షా వ్రతం ఈ రక్షా బంధన్, దేశ, ధర్మ రక్షణా దీక్షాను చేపడుదామని ఆశిస్తూ హిందూ బంధువులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు’ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు చెప్పారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎంఎల్‌సి కవిత కూడా చెప్పారని, ఆమె కూడా లీగల్ నోటీసులు ఇస్తారా? అని అడిగారు. బిర్ఎస్ పార్టీ ఎంఎల్ఎలు, మంత్రులపై కూడా కెసిఆర్ కు నమ్మకం లేకపోవడంతోనే వాళ్ల ఫోను కూడా ట్యాపింగ్ చేశారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు సహకరించుకుంటున్నారని దుయ్యబట్టారు. తండ్రి, తాతల పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సవాల్ విసురుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా? అని బండి ప్రశ్నించారు. తన కుటుంబంతో కలిసి వచ్చి తాను ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News