Friday, September 19, 2025

హైదరాబాద్ విలవిల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో :హైదరాబాద్ మహా నగరాన్ని వరుణుడు వదలకుండా వెంటాడుతున్నాడు. గత రాత్రి కురిసిన భారీ వర్షం మరువకముందే గురువారం సాయంత్రం మరోసారి విరుచుకుపడ్డాడు. ముషీరాబాద్‌లో ఏకంగా 18.45 సెం.మీ.ల వర్షం కురవగా సికింద్రాబాద్‌లో 14.68సెం.మీ.లు.శేరిలింగంపల్లిలో 14.48 సెం.మీ.లు, మారేడుపల్లిలో 14.05 సెం.మీ.లు, హిమాయత్‌నగర్ లో 12.83సెం.మీ.లు, ఖైరతాబాద్‌లో 12.50 సెం.మీ.లు, గచ్చిబౌలిలో 12.35సెం.మీ.లు,బేగంపేట్,శ్రీనగర్‌లలో 11 సెం.మీ.ల వ ర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో భారీ వర్షం ఏకధాటిగా సుమారు రెండు గంటల పాటు కురిసి వర ద బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో రోడ్లు నదులుగా మారా యి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లు జలాశయాలుగా మారడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫి క్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరా యి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అ టు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇండ్లలోని ప్రజలు అవస్థలు పాలయ్యా రు. వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఫలక్‌నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెక్రటేరియట్, రాజ్ భవన్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు, వాహనదారులు రోడ్లపై ఉన్న వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా  ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. వాహనాలు బంపర్ టు బంపర్ మూవ్ అయ్యాయి. ఐటీ కారిడార్‌లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రాజ్‌భవన్ రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌లలో మోకాలి లోతు నీరు రోడ్లపై నిలిచింది.

కొండాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్ మార్గాల్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మూసీనది ఉధృతి కారణంగా అంబర్‌పేట్, – ముసారాంబాగ్ బ్రిడ్జిపై వాహానాల రాకపోకలను నిలిపివేశారు. బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠిలలో మోస్తారు వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడింది. గురువారం రాత్రి మరో రెండు గంటల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశముండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్‌పేట్, మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం కారణంగా అత్యవరమైతే హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ కి 9000113667 సంద్రించాలని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040—21111111 ని కూడా సంప్రదించాలని కోరుతున్నారు.

Also Read: మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News