Friday, September 19, 2025

స్లో ఓవర్‌రేటు.. ఆస్ట్రేలియా జట్టుకు ఫైన్

- Advertisement -
- Advertisement -

ముల్లాన్‌పూర్: మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా (Australia) మహిళ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముల్లాన్‌పూర్‌ జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేటు‌కు గాను ఆసీస్ జట్టుకు ఫైన్ విధించింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్ల వెనుబడింది. ఇందుకుగాను ఆసీస్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం జరిమానా విధించారు.

ఈ శిక్షను ఆసీస్ (Australia) కెప్టెన్ అలిసా హేలీ అంగీకరించింది. దీంతో ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్‌ ఫర్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్స్ సపోర్ట్ పర్సనల్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఒక ఓవర్‌కి ఐదు శాతం కోత విధించారు. ఇక రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. స్మృతి మంధనా శతకం సాధించడంతో భారత్ 292 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ లక్ష్య చేధనలో తడబడింది. 40.5 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Also Read : నేడు ఒమన్‌తో భారత్ ఢీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News