Saturday, September 20, 2025

గుంటూరులో బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ శివారులో ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారు అందరూ స్వల్పంగా గాయపడ్డారు. రాజస్థాన్‌కు చెందిన 50 మంది యాత్రికులు గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News