Sunday, September 21, 2025

అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం, అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్(40)తో పక్క గ్రామమైన గోవిందపురానికి చెందిన మంజులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత వీరు ఉపాధి కోసం ముంబాయికి వలస వెళ్ల్లారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వివాహం జరిగిన నాలుగేళ్ల వరకు దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత శంకర్‌కు తన భార్యపై అనుమానంతో పలుమార్లు కొట్టడం, వేదించడం చేస్తుండేవాడు. ఈ వేధింపులు భరించలేని మంజుల ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని తన అక్క ఇంటికి వచ్చింది.

ఈనెల 18వ తేదీ కుమారులతో కలసి శంకర్ హైదరాబాద్ వచ్చాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడి ఇకనుంచి గొడవ పడమని చెప్పి అందరూ కలిసి భోజనం చేసి నిద్రించారు. రాత్రి పదకొండున్నర గంటల సమయంలో శంకర్ కత్తితో మంజుల గొంతు కోసి కడుపులో పొడిచి పారిపోయాడు. మంజుల అక్క, బావ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోనట్టు ధృవీకరించారు. ఈ సంఘటనపై వారు కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎసిపి వెంకట్‌రెడ్డి, సిఐ భాస్కర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News