Sunday, September 21, 2025

కల్వకుర్తిలో కలకలం రేపుతున్న న్యూడ్ వీడియోల బాగోతం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో న్యూడ్ వీడియో కాల్స్ పేరిట నమ్మించి రూ.3.8 కోట్ల మేరకు టోకరా వేసిన బాగోతం ఆలస్యంగా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ళ మేరీ, వారితో పాటు వారి స్నేహితురాలు మల్లిక అలియాస్ లిల్లీ ఈ మోసానికి పాల్పడారు. డిగ్రీ చదివిన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారిని ఎంచుకున్నారు.

మోసానికి ఇలా తెర లేపారు
మల్లేష్, మేరీ, లిల్లీ సంయుక్తా రెడ్డి పేరిట ట్విట్టర్ (ఎక్స్)లో నకిలీ ఖాతా తెరిచి బాధితుడికి న్యూడ్ వీడియోలు పంపడం, తర్వాత ఓ మహిళతో నకిలీ వీడియో కాల్స్ జరపడం, తక్కువ ధరలకు స్థలాలు అమ్ముతామంటూ నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. న్యూడ్ వీడియోలతో మోసం చేసిన ముగ్గురూ కల్వకుర్తి వారే కావడంతో ఇన్ని రోజులూ మన మధ్య తిరిగినవారు ఇంత మోసానికి తెగబడ్డారా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

మోసంతో వచ్చిన డబ్బుతో జల్సాలు
మల్లేష్, మేరీ, వారి స్నేహితురాలు లిల్లీ న్యూడ్ వీడియో కాల్స్‌తో వచ్చిన మొత్తం రూ.3.8 కోట్లతో రూ.41.26 లక్షలతో కార్లు, బైక్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన మొత్తాన్ని జల్సాలు, విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News