Sunday, September 21, 2025

మంధాన శతకం వృథా.. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత్

- Advertisement -
- Advertisement -

మూడో చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. 47 ఓవర్లలో టీమిండియా 369 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్ లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(125) విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. మంధానతోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52), దీప్తి శర్మ(72)లు అర్థ శతకాలతో రాణించినా పలితం లేకపోయింది. ఆసిస్ బౌలర్లలో గిమ్ గార్త్ 3 వికెట్లు, మేగాన్ షట్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆష్లీన్ గార్డ్‌నర్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రెస్ హారిస్, జార్జియా వేర్‌హామ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది.

కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో  47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ(138 పరుగులు), ఓపెనర్ జార్జియా వాల్ (81), ఎల్లీస్ పెర్రీ (68)లు అర్ధ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, రేణుకా సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, స్నేహ్‌ రాణాలు ఒక్కో తీకెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News