Sunday, September 21, 2025

ఢిల్లీలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు పూర్తయిన తరువాత ఇవి వట్టి బూటకమేనని తేలింది. టెర్రరైజర్స్ 111 అనే పేరుతో ఓ గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చాయని పోలీసులు చెప్పారు. ఇదివరకు కూడా ఈ గ్రూపు ఈ మెయిళ్ళ ద్వారా బెదిరింపులు పంపిందని తెలిపారు. ద్వారక లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, క్రిష్ణా మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ, సిఆర్‌పిఎఫ్ పబ్లిక్ స్కూల్, నజఫ్‌గడ్ లోని మాతా విద్యాదేవి పబ్లిక్ స్కూల్ తదితర 10 స్కూళ్ల నుంచి తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు చెప్పారు. స్కూళ్లన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశాక అవి వట్టి బూటకమే అని ప్రకటించారు. బాంబు డిస్పోజల్ స్వాడ్, పోలీస్ బృందాలు స్కూళ్ల నుంచి విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టాయి. గందరగోళం సృష్టించడానికి ఈ బెదిరింపులు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News