- Advertisement -
సూర్యాపేట: ఆల్మట్టి డ్యామ్‌పై ఢిల్లీకి వెళ్లి వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సూర్యాపేట జి్ల్లాలో ఆయన పర్యటించారు. పాలకవీడు మండలంలో జవహర్ జాన్‌పహాడ్ ఎత్తిపోతల వథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. భారత రాష్ట్ర సమితి పాలనలో కూలిపోయే కాళేశ్వరం కట్టారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. అది పూర్తయ్యాక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
Also Read : గాజులరామారంలో 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం: రంగానాథ్
- Advertisement -