- బైక్ ను బస్ ఢీకొట్టడం తో గాయాలపాలైన వ్యక్తిని దగ్గర ఉండి హాస్పటల్‌కు పంపించిన మంత్రి సీతక్క (Minister Seethakka)
సూర్యాపేట నుండి ఏటూరు నాగారం వెళ్తున్న బస్‌ని చిన్నబోయిన పల్లి నుంచి వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైకు పైన ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో ఆ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క (Minister Seethakka) అనంతరం మంగపేట మండల పర్యటనకు వెళ్తున్న క్రమంలో గాయాలతో ఉన్న వ్యక్తిని చూశారు. వెంటనే దగ్గరుండి అతడిని హాస్పటల్‌కు పంపించి మానవత్వం చాటుకున్నారు.
మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Also Read : సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ : భట్టి