Monday, September 22, 2025

ఆ లగ్జరీ కార్లు మీ వద్దకు ఎలా వచ్చాయి?.. కెటిఆర్‌ను ప్రశ్నించిన బండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిష్టర్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని ప్రశ్నించారు. చెల్లింపులు బినామీ పేర్లతో ఉన్నాయా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తున్నదా? అని ప్రశ్నించారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News