Tuesday, September 23, 2025

భారత్-అమెరికా సంబంధాలు ఎటు?

- Advertisement -
- Advertisement -

రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందనే కుంటిసాకుతో, భారత్ అధిక సుంకాలు విధిస్తూ ‘సుంకాల రారాజు‘గా నిలిచిందని ఆరోపిస్తూ ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో వాణిజ్యంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయమైయమై బ్రెండెన్ ల్లించ్ నాయకత్వంలో క్రొత్త ఢిల్లీకి వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి, భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి భారత బృందానికి మధ్య జరిగిన చర్చల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. అయితే భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయయడం, దృశ్య మాధ్యమాల ద్వారా చర్చలు కొనసాగించి రత్వరలోనే ఒక అంగీకారానికి రావాలని నిర్ణయించడమే ఓ సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

భారత్‌కు పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి వ్యవసాయోత్పత్తులు, పాలు, వివిధ రకాల వెన్నలు, పాలపొడి వంటి పాడి ఉత్పత్తులు ఎగుమతి చేయాలని, 146 కోట్ల అతి పెద్ద జనాభా గల మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని అమెరికా తహ తహలాడుతోంది. అందుకు సరళమైన సుంకాల తో అనుమతి ఇవ్వాలని దశాబ్దాలుగా మన దేశంపై ఒత్తిడి తెస్తోంది. అయితే 86 శాతం చిన్న, సన్నకారు రైతులు, 8కోట్ల పాడిరైతుల జీవితాలపై దుష్ప్రభావము పడుతుందని భారత ప్రభుత్వం అందుకు అంగీకరించడంలేదు. అదీగాక పాల అధికోత్పత్తికి వాడే దాణాలో కలిపిన ఏంజైములుమ మాంస కృత్తులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి హానికరమని భావించడం, అవి భారత ఆచారాలు, సాంప్రపదాయలు,ఆహార అలవాట్లకు విరుద్ధంగా ఉండటం వల్ల ప్రభుత్వం వాటికి అనుమతించడము లేదు.

దీంతో డాలర్ ప్రభువు ట్రంప్‌కు పట్టరాని ఆగ్రహము కిలిగి భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి 50 శాతం సుంకాలు విధించడంతో, జౌళీ వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, వజ్రాలు, స్వర్ణాభరణాలు, టోలు వస్తువులు, పాదరక్షలు, సుగంధ ద్రవ్యాలు రబ్బర్, రొయ్యలు, చేపలు, ఇతర మత్స్య సంపద ఉత్పత్తిలో భాగస్వాములైన లక్షలాది మంది మహిళలు ఇతర శ్రామికుల జీవనోపాధులపై తీవ్ర ప్రభావం పడింది. పనులు, ఆదాయాలు కోల్పోయివారు వీధినపడి ఆక్రోషిస్తున్నారు.
రొయ్యల ఎగుమతులలో 80 శాతం, చేపలు, సముద్రఉత్పత్తులో 39 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల దెబ్బకు వాటి ఎగుమసతులు ఆగిపోయి 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ,అంచనా. అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా అభివృద్ది చేస్తానని, తయారీ రంగంలో మేటిగా నిలుపుతానని, అన్నింటా అమెరికాయే ఫస్ట్ అని నినదిస్తూ, శ్వేత జాతి దురహంకారాన్ని రెచ్చగొట్టి రెండో దఫా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఇంటాబయటా పెట్రేగి పోతున్నాడు.

భారత్‌పైనే గాక బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, కెనడా తదితర దేశాలపై భారీ సుంకాలు విధించి అమెరికా మళ్లీ సామ్రాజ్యవాద పెత్తనాన్ని, ప్రాబల్యాన్ని పెంచడానికి చేస్తున్న యత్నాలు అంతర్జాతీయ వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు సంబంధించి భారత్ 64.3, దక్షిణ కొరియా 57 శాతం, టర్కీ అన్ని వస్తువులపై 17.3, భారత దేశం సగటున16.2 సుంకాలు విధిస్తున్నాయి. అమెరికాలో సేద్యంపై ఆధారపడి జీవిస్తున్న వారు 2శాతం, యూరోపియన్ దేశాలలో కేవలం 4శాతం కాగా, చైనాలో 22 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. అమెరికాలో వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలను కంపెనీలు అత్యాధునిక యంత్రాలు, నూర్పిడి పరికరాలతో చేయడం వల్ల సాగు ఖర్చు తక్కువ. యూరోప్ చైనా తదితర దేశాలలో కూడా యంత్రాల వాడకము వల్ల సాగు ఖర్చు తక్కువ ఉత్పాదకత ఎక్కువ.

Also Read : నేడు మేడారానికి సిఎం రేవంత్ రెడ్డి

2024లో చైనా100 బిలియన్ డాలర్లు, అమెరికా 59 బిలియన్ డాలర్ల వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి. అమెరికా భారీగా మొక్కజొన్న, పత్తి వంటి 182.8 బిలియన్ దాలర్లవ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా, చైనా అనుభవాలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలి. పంట సీజన్లో యూరియా తదితర ఎరువులను సరఫరా చేయలేనిస్థితి భారత ప్రభుత్వానిది.మన దిగుమతులలో మూడోవంతు వంటనూనెలే. వాటిపై 10 శాతం సుంకం. పత్తిపై సున్నా, పచ్చబఠానీల పై నామమాత్రంగా సుంకాలున్నాయి.అమెరికా కోడికాళ్లపై వాల్ నట్స్ పై 100శాతం, యాపిల్స్ పై 50శాతం, పాలపొడిపై50 శాతం సుంకాలు విధిస్తున్నారు.

మనదేశం అతి పెద్ద బియ్యం ఎగుమతిదారు.బియ్యం డదిగుమతిపై 70 శాతం ఉంది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది కనుక అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత ప్రభుత్వ లక్ష్యానికి చేరాలంటే వివిధ రంగాలలో ఎన్నో మార్పులు తేవాలి. అమెరికా సుంకాలు ఆదేశానికి కూడా నష్టం కలిగిస్తాయని,ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళనలు వక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ 2019 సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించి హ్యూస్టన్ లో జరిగిన సభలో ట్రంప్‌తో కర చాలనం చేశారు. ఇతర దేశాల ఆంతరంగిక రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదనే నియమాన్ని పక్కన పెట్టి ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ ట్రంప్ కు అనుకూ లంగా ప్రచారం చేశారు. అప్పుడు బిడెన్ గెలిచారు.

అయినా సుంకాల విషయంలో రెండోసారి అధ్యక్ధుడైన ట్రంప్ కరకుగా వ్యవహరిం చడమే గాక అక్కడ పనిచేస్తున్న భారతీయులను ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలెన్నో తీసుకున్నారు. హెచ్1బి వీసాలపై ఎన్నో ఆంక్షలు విధించాడు. భారత్ అమెరికాలలో మితవాద ప్రభుత్వాలే అధికారంలో ఉన్నా ఇప్పుడు ప్రధాని మోడీ దేశ ప్రయోజనాల కోసం గళం వినిపించక తప్పలేదు. నిజానికి ప్రచ్ఛన్న యుద్ధకాలం నుండి భారత అమెరికా సంబంధాలలో ఎన్నో ఒడిదుడుకులు తప్పడం లేదు. అమెరికా పాకిస్తాన్ పాలకులను దువ్వుతూ ఆయుధ,ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది. 1971 లో ఎన్నికయిన షేక్ ముజిబుర్ రహమాన్ కు పాక్ సైనిక పాలకులుఅధికారం అప్పగించకిపోవడం,సైనిక దమన కాండతో ఆగ్రహించిన బంగ్లా ప్రజలు విముక్తి పోరాటాన్ని ప్రారంభించగా భారత్ నైతిక మద్దతు ఇచ్చి ఆయుధ సహాయం చేసింది.

లక్షలాదిమంది శరణార్ధులకు ఆశ్రయమిచ్చి ఆదుకుంది. అప్పుడు అమెరికా అధ్యక్షుడుగా ఉన్న రిచర్డ్ నిక్సన్ పాక్‌కు మద్దతుగా తమ సప్తమ నౌకా దళాన్ని పంపారు. దీటుగా అప్పటి సోవియట్ యూనియన్ భారత్‌కు మద్దతుగా నిలవడంతో వెనుదిరగక తప్పలేదు. అలా యెన్నో అవాంతరాలు, విభేదాలతో నడిచిన భారత అమెరికా సంబంధాలు 2000సం.లో అప్పటి అధ్యక్షుడు క్లింటన్ భారత్ పర్యటనకు రావడముతో కొత్త మలుపు తిరిగాయి. తర్వాత అధికారములోకి వచ్చిన భారత్‌మెరికా ప్రభుత్వాలు, నేతలు కూడా యధాశక్తి చేసిన కృషితో రెండు దేశాల సంబధాలు ఈ స్థాయికి వచ్చాయి. ఇటీవల భారత దళాలు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ధ్వంసం చేసినపుడు తన జోక్యంతోనే భారత్ దాడులు ఆపిందని ట్రంప్ పదే పదే కోతలు కోయగా భారత్ ఖండించింది.

ఏదేశంతో సంబంధాలైనా ,వాణి జ్యమైనా పరస్పర్సప్రయోజానాల ప్రాతిపదికగానే జరగాలి.ట్రంప్ నిర్ణయాలు అమెరికాకు నష్టం కిలిగిస్తాయని ఆయుధ తదితరపరిశ్రమ వర్గాలు ఆందోళనవ వ్యక్తం చేయటంతో పెంటగన్ సూచనపై కంపెనీలునీలు తమకు అవసరమైన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకోవచ్చు ననీ మినహాసయింపుఇవ్వడం కొంత ఊరట.భారత్-అమెరికా ద్వెపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చ లు త్వరలో ఒక కొలిక్కి రాగలవని ఆశాభా వము వ్యక్తం ఆవుతోంది. మోడీ తన మిత్రుడని, భారత్ గొప్ప దేశమని ట్రంప్ కొత్త రాగం వలపించగా,అమెరికా సహజ మిత్రదేశం అని మోడీ స్పందన. భారత్ తొలి నుండి స్వతంత్ర విదేశాంగ వాణిజ్య విధానాలను అనుసరిస్తోంది.సోవియట్ కుప్పకూలాక ఏకధ్రువ ప్రపంచంగా కొన్నాళ్ళు అమెరికా కు తిరుగులేదని ఊదరగొట్టారు.

చైనాలో పుతిన్,మోడీ,షి జిన్ పింగ్ లసమావేశం తర్వాత అమెరికా తత్తరరపడి కొంత తగ్గింది. ప్రాచీన సంస్కృతి,నాగరికత గల భారత్ చైనాలు దగ్గరైతే ఉభయ తారకంగా వుంటుంది చైనాకు మన ఎగుమతులు పెంచాలి. ప్రస్తుతం దిగుమతులే ఎక్కువ. నాయకత్వం మన ప్రజల బహుళ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని దృఢంగా వ్యవరించినపుడే ,మన ఎగుమతులను వివిధ దేశాలకు విస్తరించింనపుడే లక్ష లాదిమంది ఉద్యోగ ఉపా ధులను కాపాడగలం. భారత్ అన్ని రంగాలలో రానున్న కాలము లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగ డానికి ఎంతో శ్రమించాల్సివుంది.

  • పతకమూరు దామోదర్ ప్రసాద్
  • సీనియర్ జర్నలిస్ట్ : 94409 90381
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News