అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో దారుణం వెలుగులోకి వచ్చింది. భవానిపురంలో యువతిపై అప్పారావు అనే వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. లక్ష్మి పీక కోయడంతో ఆమె వీధుల్లో పరుగులు తీసి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో కిందపడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?
- Advertisement -