Wednesday, September 24, 2025

షేక్ పేట్ లో పర్యటించిన మంత్రులు పొన్నం, వివేక్

- Advertisement -
- Advertisement -

షేక్ పేట్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లో సహచర మంత్రి వివేక్ వెంకట్ స్వామితో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. షేక్ పేట్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంత్రులకు వివరించారు. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి మంత్రులకు తెలియజేశారు. డివిజన్ లో నాలాల సమస్యలు, సిసి రోడ్లు నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. షేక్ పేట డివిజన్ లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నేతల ద్వారా తమ దృష్టికీ తీసుకురావాలనీ  మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి వారంలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

 

Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News