బ్రిస్బేన్: ఇండియా అండర్-19 (India U19) జట్టు మూడు యూత్ వన్డేల సిరీస్, రెండు యూత్ టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఇప్పటికే టీం ఇండియా ఇప్పటికే విజయం సాధించగా.. బుధవారం జరిగిన రెండో వన్డేలోనే జయకేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో అభిజ్ఞాన్ కుందు 71, వైభవ్ సూర్యవంశీ 70, విహాన్ మల్హోత్రా 70 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు ఓపెనర్ అలెక్స్ టర్నర్ 24 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు టార్గెట్‌ని చేధించడంలో తడబడ్డారు. ఈ దశలో జెడెన్ డ్రేపర్ తమ జట్టును గెలిపించుకొనేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 72 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 107 పరుగులు చేశాడు. జెడెన్కి ఆర్యన్ శర్మ కొంతమేర సహకారం అందించాడు. 44 బంతుల్లో 2 ఫోర్లతో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగితా బ్యాట్స్మెన్లు అంతా స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆసీస్ అండర్-19 జట్టు 249 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ఈ మ్యాచ్‌లో మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ (India U19) 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
Also Read : చెలరేగిన వైభవ్.. ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు..