Wednesday, September 24, 2025

కీసర పరిధిలో కిడ్నాప్ కలకలం

- Advertisement -
- Advertisement -

నగర శివారులోని కీసర పోలీసుస్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ జంట తమ కూతురిని కిడ్నాప్ చేసిన ఘటన పెను సంచలనం రేపుతోంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని నర్సంపల్లి గ్రామంలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. తల్లిదండ్రులు తమ కన్న కూతురుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు కారణం ప్రేమ వివాహమేనని తెలుస్తోంది. నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ప్రవీణ్, యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే వివాదం కొనసాగుతోంది. నాలుగు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా బుధవారం యువతి తల్లిదండ్రులు తమ బంధువులతో కలిసి బుధవారం తెల్లవారుజామునే ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. ప్రవీణ్‌పై అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం కారం పొడి చల్లి, కళ్లకు బట్టలు కట్టి యువతిని ఆమె తల్లిదండ్రులు ఎత్తుకెళ్లారు. అయితే, అమ్మాయి భర్త ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News