Wednesday, September 24, 2025

భారత మహిళ జట్టుకు ఆ లక్ష్యం సరిపోదు: మాజీ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌కి ముందు టీం ఇండియా మహిళల జట్టు (India Womens Team) అద్భుతమైన ఫామ్‌తో ఆడుతోంది. మెగా టోర్నమెంట్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి వన్డేలో చివరివరకూ పోరాడి ఓడిపోయింది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధనా అదిరిపోయే ఫామ్‌లో ఉంది. వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా భారత మహిళల జట్టుపై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సుష్మా వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘గత రెండు సంవత్సరాలుగా భారత మహిళ జట్టు (India Womens Team) చక్కగా రాణిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. గతంలో బ్యాటింగ్ అంతా హర్మన్‌ప్రీత్, స్మృతి మీదే ఆధారపడి ఉండేది. కానీ ఇఫ్పుడు జట్టులో ఒక స్పష్టత వచ్చింది. ప్రతీక, రిచా చక్కగా ఆడుతున్నారు. జెమీమా, స్మృతి, హర్మన్‌లు కూడా ధారాళంగా పరుగులు చేస్తున్నారు. ఇప్పుడు టీం ఇండియా ముందు కేవలం 250 పరుగుల టార్గెట్ ఉంచితే సరిపోదు. ఈ విషయం ప్రత్యర్థి జట్లకు స్పష్టంగా అర్థమవుతోంది’’ అని సుష్మా వర్మ అన్నారు.

Also Read : హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News