Monday, May 13, 2024

డిసెంబర్ 31 నుంచి ‘ఆగ్ ఔర్ పానీ కి టక్కర్’ ప్రసారం

- Advertisement -
- Advertisement -

కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం చెప్పేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా. అయితే ఇది మీకోసమే. ఇన్నాళ్లు ఎంతగానో అలరించిన పాత్రలు ఇప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ మెంట్ కు గురిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో చిన్నారుల ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అయినటువంటి POGO ఛానెల్ లో ఐకానికి పాత్రలైన లిటిల్ సింగమ్, చోటా భీమ్ ఇప్పుడు కలిసి మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీరిద్దరి కలయికలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆగ్ ఔర్ పానీ కి టక్కర్’ డిసెంబర్ 31, ఆదివారం నుంచి ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి భాషల్లో ఇది మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచే అద్భుతమైన సాహసానికి హామీ ఇస్తుంది.

రెండు లోకాలకు చెందిన దిగ్గజ సూపర్ విలన్‌లు, కిర్మదా, కాల్ బలగాలు లిటిల్ సింగం, కామ్ మధ్య నీటిలా ఘర్షణకు దారితీయడంతో కథనం మొదలవుతుంది. కానీ శక్తివంతమైన చోటా భీమ్ దీన్ని అడ్డుకుంటాడు. దీనిద్వారా రెండు లోకాలు ప్రమాదంలో పడతాయి. టైటాన్స్ ఆఫ్ ది టూన్‌ వరల్డ్‌ లో సూపర్‌కాప్ వర్సెస్ సూపర్‌హీరో తలపడినప్పుడు వారి మధ్య పోటీ మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

ఈ సందర్భంగా కిడ్స్ క్లస్టర్ – సౌత్ ఏషియా హెడ్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఉత్తమ్ పాల్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. అందరికి ఇష్టమైన ఇద్దరు వీరులైన లిటిల్ సింగం, ఛోటా భీమ్‌లను కలిపి క్రాస్‌ఓవర్ సినిమాలోలా ‘ఆగ్ ఔర్ పానీ టక్కర్ లోకి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం రిలయన్స్ యానిమేషన్, రోహిత్ శెట్టి పిక్చర్స్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్‌తో పాటు యానిమేషన్ ప్రపంచంలోని ఉత్తమ మనస్సులు, కళాకారులతో కలిసి వస్తోంది, అలాగే ఐకానిక్ టైటాన్స్ ఆఫ్ టూన్‌వరల్డ్, కిడ్స్ జానర్‌లో ఒక చారిత్రాత్మక సంఘటన ఉండబోతోందని అభిమానులకు POGO వాగ్దానం చేస్తోంది” అని అన్నారు ఆయన.

ఈ ప్రత్యేకమైన చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సస్పెన్స్, యాక్షన్, ఊహించని ప్లాట్ ట్విస్టులతో మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

“యానిమేషన్ పరిశ్రమలో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ తో కలిసి తొలిసారిగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇలాంటి మరో మైలురాయిని అందుకోవడం గర్వంగా ఉంది. థ్రిల్, ఊహించని సంఘటనలు, హీరోయిజం యొక్క శక్తి, పూర్తిగా భిన్నమైన రెండు విశ్వాలను ఏకీకృతం చేయడం లాంటి విభిన్నమైన అంశాలు ఉన్న ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అసోసియేషన్ నిజంగా ఉత్తేజకరమైన ప్రక్రియ. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మన యువ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది”అని అన్నారు రిలయన్స్ యానిమేషన్ సీఈఓ తేజోనిధి భండారే.

ఈ సందర్భంగా ఎపిక్ క్రాస్‌ఓవర్ గురించి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ, ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “యానిమేటెడ్ ప్రపంచంలో మరింత ముందుకు అంటే ఛోటా భీమ్ అభిమానులను లిటిల్ సింగం, ధోలక్‌పూర్ లోకి తీసుకెళ్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. తమదైన నమ్మకం కోసం పోరాడుతున్నప్పుడు ఉత్కంఠ, యాక్షన్, ఊహించని మలుపులు ఉంటాయి. అలాంటి ఊహించని మలుపులతో కూడిన అనుభవాన్ని అభిమానుల కోసం మొదటిసారిగా అందిస్తున్న టైటాన్‌లు భారతీయ టెలివిజన్‌లో కనిపిస్తాయి. త్యాగం, వీరత్వాన్ని పునర్నిర్వచించే భీమ్ సరికొత్త యుద్ధాన్ని ఇకనుంచి మీరు చూస్తారు అని అన్నారు ఆయన.

ఈ ఉత్కంఠభరితమైన క్రాస్‌ఓవర్ ఈవెంట్, ‘ఆగ్ ఔర్ పానీ కి టక్కర్,’ POGOలో డిసెంబర్ 31 ఆదివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రీమియర్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News