Friday, August 8, 2025

బెజవాడలో ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

- Advertisement -
- Advertisement -

ఎపి గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను ఎసిబి అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుం టుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్‌సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు. అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని ముందుగా చేసు కున్న ఒప్పందం ప్రకారం గురువారం శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన శాఖలో ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి లంచం కేసులో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News