Thursday, May 30, 2024

అభివృద్ధిని జీర్ణించుకోలేక సిఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అభివృద్ధిని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శులు చారగొండ వెంకటేష్, పున్న కైలాష్ నేత అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకున్న , దాచుకున్న సొమ్మును కక్కిస్తామనే భయంతో మాట్లాడుతున్నారని చారగొండ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై సైంటిఫిక్ ఆధారాలతో మాట్లాడారని తెలిపారు. బాల్క సుమన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బాల్క సుమన్ అమాయక విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్న నీచుడని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి చావుకు బాల్క సుమన్ కారణమయ్యాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు తెలంగాణ కోసం కష్ట పడుతున్నారన్నారు. వున్న కైలాష్ నేత మాట్లాడుతూ రెండు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తున్న ఆధరణచూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపిస్తే తెలంగాణ ప్రజలు నిన్ను బట్టలుడదీసి కొడుతారని ధ్వజమెత్తారు. నీటి విషయం పై జరిగిన దోపిడీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే హరీష్ రావు, కెటిఆర్ లు సమాధానం చెప్పలేక నోరు పారేసుకుంటున్నారన్నారు. బాల్క సుమన్ దళిత ద్రోహి అని, తిండికి లేక ,రబ్బరు చెప్పులతో తిరిగే నీకు వేల కోట్లు ఎలా వొచ్చాయని ప్రశ్నించారు. మీ పార్టీ అవినీతిపై రేపు అమరు వీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News