Saturday, August 9, 2025

థ్రిల్లింగ్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. (Constable Kanakam) ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ..‘డైరెక్టర్ ప్రశాంత్ ఈ సిరీస్‌ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక అమ్మాయి గౌరవం పెంచేలా (increase girl respect) ఈ సిరీస్ ఉంటుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News