Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: పార్టీలోనే ఉంటూ, పార్టీకి నష్టం కలిగించే వారు, పార్టీ నాయకత్వానికి క్రమశిక్షణ చేస్తున్న వారి చర్యల గురించచి ప్రతి సభ్యునికి తెలిపి, సమష్టి నిర్ణయం తీసుకొని జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు క్రమశిక్షణా కమిటీ సూచన మేరకు అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్మే, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు.

మార్కండేయకాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన నియోజక వర్గ సర్వసభ్య సమావేశానిక ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఎన్నికల్లో లబ్ధిఢ పొందేందుకు మనపై ఇతర పార్టీల నాయకులు దుష్ఫ్రచారం చేయడం సహజమేనని, కానీ మన పార్టీలోనేఉంటూ, పార్టీని అప్రదిష్టపాలు చేస్తూ, పార్టీ నాయకత్వాన్ని పలుచన చేసే ఒక కుట్ర జరుగుతోందని అన్నారు.

పార్టీ టికెట్‌పై గెలిచి ప్రజా ప్రతినిధులు అయిన వారు, మరింత పెద్ద పదవీని ఆశించి, పార్టీకి నష్టం కలిగించే విధంగా, ఒక ఉద్యమకారుడిని కించ పరిచే విధంగా ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఆ అయిదుగురు పోటీ కార్యక్రమాలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ఫ్రమాదం ఉందని, ఈ విషయాన్ని ప్రతీ సభ్యుని దృష్టికి, క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లి తదుపరి కార్యచరణ కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు.

సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, పాలకుర్తి ఎంపిపి వాల్ల అనసూయ రాంరెడ్డి, జడ్పిటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, ఎర్రం స్వామి, సర్పంచ్‌లు ధరణి రాజేష్, కోల లత, మల్లెత్తుల శ్రీనివాస్, తుంగపిండి సతీష్, రామగుండం నియోజక వర్గ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పిటి.స్వామి, సభ్యులు తోడేటి శంకర గౌడ్, నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News